Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాదిత కుటుంబానికి ఆర్థిక చేయూత

బాదిత కుటుంబానికి ఆర్థిక చేయూత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన శివ వెంకటమ్మ కుటుంబ సభ్యులను సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పారునంది భాస్కర్ రూ.3,000 నగదు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల ఆంజనేయులు,ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్, కొల్లూరు మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి లక్ష్మయ్య, వార్డు సభ్యులు ఎం.డి. మస్తాన్, అచ్చిని బిక్షపతి,గ్యాదపాక లక్ష్మయ్య,కాంగ్రెస్ నాయకులు గ్యాదపాక మల్లేష్, గ్యాదపాక సురేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరపటి నర్సింగ్,ఉపాధ్యక్షుడు కండ్రాజు కరుణాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -