Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో ఉత్తమ సోసైటీగా అడ్లూరు ఎల్లారెడ్డి 

జిల్లాలో ఉత్తమ సోసైటీగా అడ్లూరు ఎల్లారెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
జిల్లాలో ఉత్తమ సోసైటీగా అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎంపికయింది. సోమవారం జిల్లా అధికారుల చేతుల మీదుగా సీఈవో లింగమూర్తి అవార్డును, అందుకున్నారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ధాన్యాన్ని సకాలంలో తూకం వేసి రైస్ మిల్లులకు తరలించడం, రసాయన ఎరువులు రైతులకు పంపిణీ చేయడం, రుణాలు అందించడంతోపాటు రైతులకు అందుబాటులో ఉండి సొసైటీ ద్వారా సేవ చేయడంతో ఈ గుర్తింపు లభించిందని, సొసైటీ పాలకవర్గం తో పాటు, సిబ్బంది చేసిన సేవలే ఉత్తమ సొసైటీగా ఎంపికైనట్లు తెలిపారు. ఈ గుర్తింపుతో సొసైటీ పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో రైతులకు మరింత ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -