- Advertisement -
- డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ అధికారి డ్రగ్స్‌పై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి పెంచే వారిని తీవ్రవాదుల కంటే ఎక్కువగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ సందర్భంగా పోలీసులకు ఆయన సూచించారు.
- Advertisement -



