Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపశ్చిమ బెంగాల్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

పశ్చిమ బెంగాల్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ నాలుగు అంతస్తుల హోటల్‌లో సోమవారం ఉదయం సుమారు 4.30–5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పలువురు భక్తులు నిద్రలో ఉండగా.. అందులో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి బాధితులను రక్షించారు. క్షతగాత్రులను రాంపూర్‌హాట్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -