Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయంఎన్‌టీఏను రద్దు చేయాలి

ఎన్‌టీఏను రద్దు చేయాలి

- Advertisement -


ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ మార్చ్‌..అడ్డుకున్న‌ భద్రతా దళాలు
విద్యార్థుల‌పై పోలీసులు దాడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

నీట్ ప్రశ్నాపత్రం లీక్ లో అవకతవకలకు కారణ మైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఎన్టీఏ ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. సోమ‌వారం ఢిల్లీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో జరిగిన ఈ పాదయాత్రను పోలీసులు,కేంద్ర పారామిలిటరీ బలగాలు అడ్డుకున్నా యి. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లిం చారు. రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఎలామన్, సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా, ఉపాధ్యక్షుడు ఆరిఫ్ సిద్ధిఖీ ‘చలో ఎన్‌టిఎ’ అనే నినాదంతో పాదయాత్ర చేశారు. ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని స‌మ‌ర్పించేందుకు యత్నించారు. డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళ‌న‌ కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నేత‌లు ప్రకటించారు. మరోపక్క కేంద్ర ప్రభు త్వాన్ని నిరంతరాయంగా విమర్శిస్తున్న ఎస్ఎఫ్ఐ ఢిల్లీ, ఇన్‌స్టాగ్రామ్ పేజీని లాక్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -