- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో లష్కర్-ఎ-తైబా ఉగ్రవాదిని భదత్రా బలగాలు మట్టుబెట్టాయి. బుధవారం షోపియాన్ జిల్లా చనాపోరా అడువుల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ (RR) , CRPF సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈక్రమంలో ఉగ్రవాదికి, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయ. పరస్పర దాడుల్లో ఉగ్రవాది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో పలు రకాల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సిందని ‘X’ వేదికగా పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -



