నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, తెలంగాణలోని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ నిన్న రాత్రి కన్నుమూశాడు. ఈ వార్త తెలియగానే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా నిరంజన్‌ను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగాన్ని ఆయన వ్యక్తం చేశారు.”నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్దిరోజుల క్రితమే హనుమకొండలో వాళ్ల ఇంటికి వెళ్లి కలిసిన క్షణాలు ఇంకా నా కళ్లముందే కదలాడుతున్నాయి. అంతటి భయంకరమైన అనారోగ్యంతో పోరాడుతూ కూడా నన్ను చూడగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం. శరీరం వ్యాధితో క్షీణిస్తున్నా… మనసు నిండా కొండంత ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. అంతటి ధైర్యశాలి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నా. ఆ చిన్నారి చూపిన ప్రేమ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది” అంటూ పవన్ భావోద్వేగానికి గురయ్యారు.
నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



