Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజనం బాధ్యత ఇక టీచర్లదే.!

మధ్యాహ్న భోజనం బాధ్యత ఇక టీచర్లదే.!

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో అమలు కానున్న నూతన విధానం
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిబంధనలను విద్యాశాఖ సమూల మార్పులు చేస్తోంది. గతంలో పాఠశాల హెడ్మాస్టర్ మధ్యాహ్న భోజనం నిర్వహణ చూసేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి దీనికి టీచర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. స్కూళ్లలో పని చేసే టీచర్లకు ప్రతి రోజు ఒకరికి మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యత చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు ఎలాంటి తేడా వచ్చిన దానికి పూర్తి బాధ్యత ఆ రోజు డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడిదే.

నూతన నిబంధనలు..
ప్రతి పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఉదయం టిఫిన్,మధ్యాహ్నం భోజనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఉన్నతాధి కారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రభుత్వ ఆమోదంతో దీనిని మండలంలో అమలు చేయనున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అయితే టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. గతంలో హెచ్ఎంలపై చర్యలు తీసుకునేవాళ్లు. మధ్యాహ్న భోజనానికి ఎస్ఎంసీ కమిటీతోపాటు టీచర్ను ఉంచితే స్కూళ్లకు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. భోజనం విషతుల్యమైతే సంబంధిత టీచర్ స ర్వీస్ రికార్డులోనూ పొందుపరుస్తారు.

టీచరు ఇంక్రిమెంట్, ప్రమోషన్లో కోత విధిస్తారు. భోజనం వండే సమయంలో వంటపాత్రలు శుభ్రంగా కడిగించాలి. వంటగది శుభ్రంగా ఉంచాలి. టీచర్లు కూడా విద్యార్థులతో టిఫిన్, భోజనం చేయాలని ఆదేశించనున్నారు. నూతన విధానాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ఇది మార్గం కాదంటున్నారు. బిల్లులు ప్రతీ నెలా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఈ విధానంపై మొబైల్ యాప్ను తీసుకురానున్నారు. ఇందులో ప్రతి అంశాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. అలాగూ టీచర్లు మధ్యాహ్న భోజన బాధ్యతలను మరిస్తే వెంటనే అధికారులు వారిని సస్పెండ్ చేసి ఆరు నెలలవ్యవధిలో శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -