- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ కెరీర్‌లో 350వ వికెట్‌ను సాధించి, 4,000 వేల పరుగులతో పాటు 350 వికెట్లు సాధించిన నాలుగో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో ఐదో స్థానంలో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో మూడో స్థానంలో జడేజా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్, డానియల్ వెట్టోరి, ఇయాన్ బోథమ్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
- Advertisement -



