- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై యూఎస్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీదాడులు చేసింది. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్ ల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేసింది. బహ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ సహా అగ్రరాజ్యానికి చెందిన 85 కీలక మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ పేర్కొంది. వాటిపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది. బుషెహర్‌లో అమెరికా అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ-9ను కూల్చినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.
- Advertisement -



