Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫరీద్‌పేటలో సర్పంచ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన

ఫరీద్‌పేటలో సర్పంచ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన

- Advertisement -

–  సర్పంచ్ దిష్టిబొమ్మ దహనం, కార్యాలయంలో నిర్బంధం
– రూ.4.05 లక్షల డబుల్ బిల్లింగ్ వ్యవహారంపై కలెక్టర్ విచారణ 
నవతెలంగాణ – కామారెడ్డి, పాల్వంచ

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డిపై గ్రామస్తులు, వార్డు సభ్యులు బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి రూ.4,05,036 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు జిల్లా స్థాయి విచారణలో నిర్ధారణ కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్త గుర్జాల మధుసూదన్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సంయుక్త కమిటీ విచారణ జరపగా, కాంట్రాక్టర్ జీడిపల్లి లత నుంచి నిధుల రికవరీకి, సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గత జూన్ నెలలో ఆదేశించడం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, వార్డు సభ్యులు రమాదేవి, జ్యోతి, ప్రత్యూష, నర్సింహులు, వెంకట్ తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, కాంట్రాక్టర్ జీడిపల్లి లత దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్బంధించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గతంలో వైస్ ఎంపీపీ, ఇన్‌చార్జ్ ఎంపీపీగా ఉన్న సమయంలో జరిగిన డబుల్ బిల్లింగ్ వ్యవహారంతో పాటు, ప్రస్తుతం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో రూ.11 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై  జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఎలక్ట్రికల్ షాప్ పేరుతో డీజిల్, జేసీబీ, శానిటేషన్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను అక్రమంగా డ్రా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. సర్పంచ్ అక్రమాల కారణంగా అప్పటి ఏఈఈ ఎన్. వెంకటేష్, డిప్యూటీ ఈఈ మురళిలకు షోకాజ్ నోటీసులు జారీ కావడం దురదృష్టకరమని వార్డు సభ్యులు వ్యాఖ్యానించారు.

సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని, చెక్ర పవర్ద్దు చేయాలని, ఆయనతో పాటు కాంట్రాక్టర్ జీడిపల్లి లతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు, వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -