నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హాస కొత్తూర్ లో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా హస కొత్తూర్ గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు కొత్తచెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్ నాయక్, ప్రధాన కార్యదర్శి కొనసముందర్ సర్పంచ్ బెజ్జరం రాకేష్, సలహాదారుగా చౌట్ పల్లి సర్పంచ్ ఎండీ మహబూబ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన రేవతి గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినదుకు అన్ని గ్రామాల సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో మన సర్పంచ్ లకు ఎలాంటి బాధలు కానీ, కష్టాలు కానీ వచ్చినప్పుడు అధ్యక్షుడిగా ముందుండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం కార్యవర్గ సభ్యులను తోటి సర్పంచులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల గ్రామా సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.
మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రేవతి గంగారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


