నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన గంగాధర్ కూతురు లక్ష్మి ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.
మండల శేఖర్ వాళ్ళ నాన్న రాజన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. మృతులు అనారోగ్యాలకు గల కారణాలను వారి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



