Wednesday, July 8, 2026
E-PAPER
Homeజాతీయంపుణేలో కూలిన భవనం..ముమ్మరంగా సహాయక చర్యలు

పుణేలో కూలిన భవనం..ముమ్మరంగా సహాయక చర్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలోని పుణేలో భారీ భవనం కూప్పకూలిపోయిన విషయం తెలిసిందే. పింప్రి-చించ్‌వాడ్‌లోని మోషి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా బుధవారం నాడు చెత్త కుప్ప కూలి, మూడు అంతస్తుల భవనంపై పడటంతో సుమారు 15 మంది అందులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను రక్షించడానికి యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రమాదం సమయంలో శిథిలాల కింద మొత్తం 15 నుంచి 16 మంది పడిపోయారని అధికారుల అంచనా. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం .

భవనం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు కమిషనర్ నుంచి వివరాలు కోరారు. మోషిలోని మున్సిపల్ కార్పొరేషన్ ‘వేస్ట్-టు-ఎనర్జీ’ (చెత్త నుండి విద్యుత్ తయారీ) ప్లాంట్‌కు చెందిన మూడు అంతస్తుల పరిపాలనా భవనానికి సుమారు 30 మీటర్ల దూరంలో SLF (శానిటరీ ల్యాండ్‌ఫిల్) అని పిలువబడే భారీ చెత్త కుప్ప ఉందని పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ తెలిపారు. నగరం అంతటా కురిసిన భారీ వర్షాల కారణంగా పేరుకుపోయిన భారీ చెత్తాచెదారం భవనంపై ఒక్కసారిగా పడిందని, దీంతో కాంక్రీటు స్లాబ్ కూలిపోయిందని, ఆ సమయంలో అక్కడ పదహారు మంది కార్యాలయ సిబ్బంది భోజనం చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. వారిలో ఇద్దర్నీ వెలికి తీశామని, మిగిలిన వారి కోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు; అందరూ సురక్షితంగా ఉన్నారని కమిషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ మీడియాకు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -