- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. దూలపురం రేంజ్ అటవీ ప్రాంతంలోని మేషన్ లోద్ది జలపాతంలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు అటవీ మార్గం గుండా జలపాతానికి వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా వైభవ్ అనే బీటెక్ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు అతడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.
- Advertisement -



