సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా ‘కొత్త సినిమా’. ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ‘మేము కూడా సినిమా తీసినామురో..’ పాటను ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక ,నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ మహమ్మద్ వాసిమ్ అక్రమ్ మాట్లాడుతూ,’ టైటిల్ కు తగినట్లే మా సినిమా నిజంగా కొత్తగా ఉంటుంది. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుతున్నా’ అని అన్నారు.డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ,’ మేము కింద స్థాయి నుంచి వచ్చామని చాలా మంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. పట్నంలోనే ఉంటదా కళామతల్లి, జర వెతికి చూడు ఉంటుంది గల్లీ గల్లీ అని ఈ పాటలో చెప్పినట్లు సినిమాను లోకల్ లో తీసి వందమంది కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నా. మన ఊరిలోనే ఉంటూ మన ఊరివాళ్లతో సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేశా’ అని అన్నారు.
100 మంది కొత్త నటీనటులతో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



