నవతెలంగాణ-హైదరాబాద్: రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఢిల్లీ స్తంభించిపోయింది. గురువారం ఉదయం రాజధాని,దాని పరిసర నగరాల్లో విస్తృతంగా నీరు నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఢిల్లీలోని మెహ్రౌలీ-బదర్పూర్ (MB) రోడ్డు ఈ వర్షాలకు అధికంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో భారీగా వర్షపునీరు నిల్వడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో పలు వాహనాలు నీట మునిగాయి. బురారీ ప్రాంతంలో కూడా రోడ్లు పూర్తిగా నీట మునిగిపోగా, అక్షర్ధామ్ ఆలయం సమీపంలోని NH-24పై భారీ ట్రాఫిక్ జాం అయింది. ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమైయ్యయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
ఢిల్లీలో వర్షాలు.. రోడ్లు జలమయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



