Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంకేరళలో కూలిన శతాబ్దాల నాటి క్లాక్‌ టవర్

కేరళలో కూలిన శతాబ్దాల నాటి క్లాక్‌ టవర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలో శతాబ్దాల నాటి క్లాక్‌ టవర్ గురువారం పాక్ష‍ికంగా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఇది ప్రమాదం కాదని, కోజికోడ్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రణాళిక ప్రకారం కూల్చివేత చేపట్టామని రైల్వే అధికారులు తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు. కోజికోడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో 25 అడుగుల ఎత్తు కలిగిన వందేళ్ల క్రితం నాటి క్లాక్‌ టవర్‌ గురవారం ఉదయం పాక్ష‍ికంగా కూలిపోయింది. ఆ సమయంలో శిథిలాలు ప్లాట్‌ఫారమ్‌ 2, మూడవ నెంబర్‌ రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. ప్లాట్‌ఫారమ్‌పై జనం తక్కువగా ఉన్నారని, దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న ఈ స్టేషన్‌లోని 150 ఏళ్లకు పైగా పురాతనమైన భవనంలో, పాత స్టేషన్‌కు ఒక మైలురాయిగా నిలిచిన గడియారపు గోపురంలోని కొంత భాగం ప్లాట్‌ఫాం నంబర్ రెండుపై కూలిపోయింది. అయితే తొలుత ఇది ప్రమాదవశాత్తు కూలిపోయిందని స్థానికులు భావించారు.

బుధవారం క్లాక్‌ టవర్‌ భవనంలో పగులు కనిపించడంతో, ఆర్‌పిఎఫ్‌ అధికారులు రంగంలోకి దిగి ఆ ప్రాంతం నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పగులు ఏర్పడటంతో భవనంలోని కొంత భాగాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, గురువారం ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తుండగా ఒక్కసారిగా భవనం కూలిపోయింది. అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్, ఆర్‌పిఎఫ్‌, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -