- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రూ.7,345 కోట్లతో జోన్-1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.4,500 కోట్ల ఏడీబీ రుణంతో మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు.. ప్రాజెక్టును చేపట్టనుంది. జోన్-1ఏలో హిమాయత్‌సాగర్-బాపూఘాట్ వరకు రూ.3,104 కోట్లతో 9.20 కి.మీ అభివృద్ధి చేయనున్నారు. జోన్-1బీలో ఉస్మాన్ సాగర్-బాపూఘాట్ వరకు రూ.3,950 కోట్లతో 11.80 కి.మీ అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి ఎంఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- Advertisement -



