Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ విద్యా విధానం-2020లో చేరొద్దు

జాతీయ విద్యా విధానం-2020లో చేరొద్దు

- Advertisement -

ఇంటర్ బోర్డును ఎస్సెస్సీలో 
విలీనం చేయొద్దు
తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్ కు టీజీజేఎల్ఏ 475 వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 లో చేరొద్దనీ, రాష్ట్రంలో ఇంటర్ విద్య బోర్డును ఎస్సెస్సీ బోర్డులో విలీనం చేయవద్దని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ 75 ) సూచించింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె పి శోభన్ బాబులు హైదరాబాద్ లో మంగళవారం ఇంటర్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్ తో సమావేశమయ్యారు. డైరెక్టర్ ఆహ్వానం మేరకు తమ అభిప్రాయాలతో కూడిన పత్రాన్ని ఆమెకు అందజేశారు.

జాతీయ విద్యా విధానం 2020 మతతత్వ విధానాలతో కూడి ఉందని అభ్యంతరం తెలిపారు. ఈ విద్యా విధానంలో ఉన్న కోర్సులను పరిశీలించినట్టయితే ఆధునిక విజ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుందని తెలియజేశారు. ఉదాహరణకు జ్యోతిష్యం లాంటి కోర్సులను జాతీయ విద్యా విధానంలో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందిస్తామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యా విధానాన్ని నియంత్రణ చేయడం సరి కాదని వ్యతిరేకించారు. భిన్న సంస్కృతులు, ఆచారాలు ఉన్న భారతదేశంలో ఏకీకృత విద్యా విధానం విజయవంతం కాదని చెప్పారు. రాష్ట్రాలపై త్రిభాషా సూత్రం అమలు చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదని స్పష్టం చేశారు. ళాశాల విద్యలో ప్రయివేటు యూనివర్సిటీలకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ రంగంలోనే యూనివర్సిటీలను స్థాపించాలని కోరారు. నాణ్యత పేరుతో కళాశాలల సంఖ్య తగ్గించవద్దని సూచించారు. జాతీయ విద్యా విధానం ప్రయివేటు యూనివర్సిటీలకు అవకాశం కల్పిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నత విద్య సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదనీ, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలోపేతం కాకుండా ఈ విధానం నష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఎంఫిల్ రద్దు చేయడం, బీఈడీ రెండు సంవత్సరాలు చేయటం, డిగ్రీ కోర్సుల్లో ఇయర్ వైస్ గా సర్టిఫికెట్ ఇవ్వడం సరి కాదని తెలిపారు. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యలో డ్రాప్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహణ కొరకు కేంద్ర స్థాయిలో ఎన్ టీఏ ఏర్పాటు చేసి పరీక్షలు కేంద్రీకృతం చేయడంతో పేపర్ లీకేజీల సమస్యలేర్పడి దేశవ్యాప్తంగా పరీక్ష రాసే వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ఉద్యోగులకు కేంద్ర సంస్థలు, రాష్ట్ర ఉద్యోగులు, విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఎంట్రెన్సులు నిర్వహించుకునే అధికారాలుండాలన్నారు.

1969 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 +2 + 3 విధానంలో భాగంగా ఇంటర్ విద్యను ప్రారంభించారని తెలిపారు. దీంతో గత ఐదు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది పైగా విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. వారు జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, ప్రొఫెషనల్ కోర్సుల్లో పోటీపడి అనేక సీట్లు సాధించడంలో అగ్రస్థానంలో ఉన్నారని గుర్తుచేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపితే ఇంటర్ విద్యార్థుల మీద ప్రత్యేకంగా కేంద్రీకరణ తగ్గి వారి విద్యాభివృద్ధి నైపుణ్యం నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యలో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో బోధించడానికి ప్రత్యేకంగా లెక్చరర్లు ఉండటంతో నైపుణ్యం సాధించిన అధ్యాపకులు, విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొ న్నారు. ఇంటర్ విద్య ను హైస్కూల్లో విలీనం చేస్తే నైపుణ్యం ఉన్న అధ్యాపకులు వికేంద్రీకరణ జరిగి విద్యార్థులు కు నైపుణ్యత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైస్కూల్ సిబ్బంది, ఇంటర్ విద్య అధ్యాపకులకు సంబంధించిన అనేక సర్వీసులకు సంబంధించిన అనేక అంశాలపై విబేధాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విద్యా వ్యవస్థలో తగాదాలకు దారి తీస్తుందనీ, దీని ప్రభావం విద్యార్థులపై పడుతుందని చెప్పారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే చోట చదివిన విద్యార్థులకు, ఇంటర్ విద్య వచ్చే సరికి శారీరక,మానసిక మార్పులు కలుగుతాయని తెలిపారు. ఈ స్థాయిలో వారికి ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఉంటే వారికి మానసికంగా తాము విద్యా వ్యవస్థలో పై మెట్టుకు లేదా పై దశకు వెళుతున్నామని మానసిక భావన ఏర్పడి, వారి విద్యా నైపుణ్యం పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -