Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంఈ20 ఇథనాల్ పెట్రోల్ వాడకంపై కావాలనే అబద్ధపు ప్రచారాలు

ఈ20 ఇథనాల్ పెట్రోల్ వాడకంపై కావాలనే అబద్ధపు ప్రచారాలు

- Advertisement -
  • కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

నవతెలంగాణ-హైదరాబాద్: ఈ20 ఇథనాల్ పెట్రోల్ వాడకంపై దేశవ్యాప్తంగా వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విమర్శలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ఇంధనం (E20 Fuel) వల్ల దేశంలో ఒక్క కారుకైనా నష్టం వాటిల్లినట్లు నిరూపించగలరా? అంటూ ఆయన విమర్శకులకు సవాలు విసిరారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై కొందరు కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపారేశారు. మంగళవారం జరిగిన ‘వికసిత్ భారత్ కాన్‌క్లేవ్’లో నితిన్ గడ్కరీ ఈ అంశంపై మాట్లాడుతూ.. “E20 పెట్రోల్ వల్ల వాహనాలకు సమస్యలు వస్తున్నాయనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. దేశంలో దీనివల్ల ఏ కారైనా పాడైందా? ఉంటే ఒక్క కారు పేరైనా చెప్పండి” అని ప్రశ్నించారు. ఈ ఇంధనంపై జరుగుతున్న ప్రచారాలు కేవలం పెయిడ్ క్యాంపెయిన్స్ మాత్రమేనని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -