Thursday, July 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో ఆగని యూఎస్ దాడులు

పశ్చిమాసియాలో ఆగని యూఎస్ దాడులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యూఎస్ తన దాడులను తీవ్రతరం చేసింది. సుమారు 90కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు యూఎస్ ఆర్మీ వెల్లడించింది. ఈ తాజా వైమానిక దాడుల్లో ప్రత్యేకంగా ఇరాన్ కీలక సైనిక ఆస్తులైన వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వల కేంద్రాలపై, కీలక వ్యూహాత్మక కమాండ్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఈ సైనిక చర్యను తెలియజేసింది. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఇరాన్ సామర్థ్యాన్ని మరింత తగ్గించడానికి ఈ దాడులను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -