Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం

గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం

- Advertisement -

కాటారం డిఎస్పి సూర్యనారాయణ
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త ఆదేశాల మేరకు కాటారం డిఎస్పి శ్రీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కాటారం సిఐ నాగార్జున రావు కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్ కాటారం ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బందితో కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్వాలపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో డిఎస్పీ మాట్లాడారు. గ్రామంలో అధిక మొత్తంలో గుడుంబా తయారీదారులు ఉన్నారని,అట్టి వ్యక్తులను గుర్తించి వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఆప్పటికి వారిలో మార్పు రానట్లయితే వారికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు ఆన్ని రద్దు చేయడంపై గురించి అధికారులను కోరుతామని హెచ్చరించారు.కాటారం సిఐ నాగార్జున రావు మాట్లాడుతూ ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని,ట్రాఫిక్ రూల్స్ పాటించాలని,చిన్న పిల్లలకి డ్రైవింగ్ కొరకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా 38 లీటర్ల గుడుంబాను పలువురు వద్ద నుండి స్వాధీనం చేసుకొని సుమారు 800 లీటర్ల నల్లబెల్లం,చక్కెర పానకమును ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -