Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయండి

విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయండి

- Advertisement -

పివైఎల్ నాయకుడు ఇరుగు అనిల్
నవతెలంగాణ-నెల్లికుదురు

రేపు విద్య సంస్థల బంద్ ను విజయవంతానికై ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రగతిశీల యువ జన సంఘం (పివైఎల్) నాయకులు ఇరుగు అనిల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పిడిఎస్యు పి వై ఎల్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 10న విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థలు బందు ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలను మూసి నాలుగు వేల పాఠశాలలను నిర్వహిస్తామనడం ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ  పాఠశాలలపైన తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ములకలపల్లి నిత్యా నందు, రామ్ చరణ్ ,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -