Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదాపూర్ లో ఉచిత వైద్య శిబిరం

మాదాపూర్ లో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మాదాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశ రామచందర్ పటేల్ ఆధ్వర్యంలో జిల్లా ఆదేశాల మేరకు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి తెలిపారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించగా.. ఉపసర్పంచ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ.. గ్రామంలోని అనారోగ్య బాధితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో గ్రామంలోని వృద్ధ మహిళలు భారీగా తరలివచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష‍ల అనంతరం అవసరమైన వారికి వైద్య సిబ్బంది ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దలు జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -