Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాద కేజీబీవీ విద్యార్థినీలకు డ్రెస్సుల పంపిణీ

అనాద కేజీబీవీ విద్యార్థినీలకు డ్రెస్సుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని (జుక్కల్ అండ్ బస్వాపూర్) కస్తూరిబాగాంధీ అనాద విద్యార్థినిలకు ఎంపిడిఓ స్టాఫ్, ఎంపిఓ, పీఎస్, ఏపిఎమ్ వారి సహకారంతో బస్వాపూర్ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ సమక్షంలో సివిల్ డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన అనాధ విద్యార్థులకు సిబ్బంది సహకారంతో బట్టలు, పాఠ్యపుస్తకాలను, బ్యాగులను అందించాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి వారి ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం లో బస్వొపూర్ పెద్దలు , మాజి సర్పంచ్ సురేష్ గొండ , కేజీబివి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -