షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొడక్షన్ సొసైటీ డివిజన్ అధ్యక్షుడు దండంపల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురులోని మూడు కో ఆపరేటివ్ సొసైటీలలో భాగంగా సొసైటీలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జనరల్ స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనైనా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని బుధవారం షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ డివిజన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ గండంపల్లి సైదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికుదురు మండలంలో అత్యధిక జనాభా గల ఎస్సీలకు సొసైటీ స్థానాలను కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ స్థానాలను ఎస్సీలకు కేటాయించాలని, అది తమ గౌరవంగా భావిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. దీనిని ఉపయోగించుకుని పార్టీ అధిష్టానం పీఏసీఎస్ సొసైటీ స్థానాలను ఎస్సీలకు కేటాయించాలని మరోసారి గుర్తుచేశారు.
పిఎసిఎస్ సొసైటీ స్థానాలకు ఎస్సీ, ఎస్టి రిజర్వేషన్ కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


