నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ శివారులోని గాంధీ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ లో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల నిర్వాహకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ మనస గణేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పాఠశాల అనేది కేవలం పుస్తక విద్యను నేర్పే స్థలం మాత్రమే కాదనీ, క్రమశిక్షణ, విలువలు, బాధ్యత, నాయకత్వం, ఆత్మవిశ్వాసం వంటి జీవిత నైపుణ్యాలను పెంపొందించే ఆలయం అభివర్ణించారు. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి కోసం ఉత్తమ విద్యా వాతావరణాన్ని అందించేందుకు మేమూ, మా ఉపాధ్యాయ బృందం కట్టుబడి ఉన్నామని తెలిపారు.
అదేవిధంగా పాఠశాల పాలనాధికారిణి పద్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఆ ప్రతిభను వెలికితీసి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే మా పాఠశాల లక్ష్యమన్నారు. అనంతరం విద్యార్థుల కోసం సరదా ఆటలు నిర్వహించగా.. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. సీనియర్ విద్యార్థులు తమ పాఠశాల అనుభవాలను పంచుకుంటూ, ఆక్స్ఫర్డ్ స్కూల్ తమలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించిందని తెలిపారు. ఉపాధ్యాయులు నూతన విద్యార్థులను ఆశీర్వదిస్తూ వారికి ఘన స్వాగతం పలికారు. అలాగే సీనియర్, నూతన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



