జగపతి బాబు ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’తో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. హీరో జగపతిబాబు మాట్లాడుతూ,’ఈ సినిమా కథ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఆడుతుందని నమ్ముతున్నాను. చాలా రోజుల తర్వాత నేను సోలోగా చేసి మొత్తం భారం తీసుకుని, ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చేసిన ప్రయత్నం ఇది’ అని అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,’మనం ఎప్పుడూ సినిమాను నమ్ముకోవాలి, ప్రేక్షకులను నమ్ముకోవాలి. మిగతావన్నీ మధ్యలో వస్తాయి. మనం నమ్మిన దాని కోసం సినిమా చేయాలి. జగపతిబాబు ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశారు. ఎంతో ప్రేమించి చేశారు. ఈ సినిమా కోసం చాలా తపన పడ్డారు.
ఇంతకాలం మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేక్షక దేవుళ్లు మరోసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ,’ “ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ‘వదలా ‘ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. జగపతిబాబు గారితో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా దర్శకుడు వంశీకృష్ణ కి థాంక్యూ. ఆయన ఈ సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చోటా నన్ను ఎంతో అందంగా చూపించారు. ఆయన ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. భరద్వాజ కి, కిషోర్ కి థాంక్యూ సో మచ్. కార్తీక్ అందరికీ నచ్చే పాటలు ఇచ్చారు. ప్రతి పాట కూడా హిట్ అయింది. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
మిస్టరీ గ్రిప్పింగ్ ట్రైలర్ లాంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


