Friday, July 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలు30 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

30 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. 30 మంది ఇన్‌స్పెక్టర్లను వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గాంధీనగర్, చిక్కడపల్లి, అత్తాపూర్, సైఫాబాద్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, బోరబండ, పంజాగుట్ట, మాదన్నపేట, ఆదిబట్ల తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలను మార్చారు. అలాగే ట్రాఫిక్ అడ్మిన్, సైబర్ క్రైమ్స్, సెక్రటేరియట్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్ వంటి విభాగాలకు పలువురు ఇన్‌స్పెక్టర్లను నియమించారు. బదిలీ అయినవారు తక్షణమే రిలీవ్ అయ్యి.. కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -