- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చిబౌలితో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
- Advertisement -



