Friday, July 10, 2026
E-PAPER
Homeక్రైమ్బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మందుబాబు…

బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మందుబాబు…

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ మందుబాబు ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తికి చెందిన వెంకన్న గురువారం రాత్రి జనగామ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సును తీసుకుని సూర్యాపేట వైపు దాదాపు 21కిలోమీటర్లు వెళ్లాడు. సింగరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపానికి చేరుకున్న తర్వాత బస్సు అదుపుతప్పడంతో రోడ్డుపక్కన ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వెంకన్నను విచారించారు. డిపో నుంచి బస్సును ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిచంగా.. ఊరికే ట్రయల్ వేద్దామని బస్సు నడిపానని మందుబాబు సమాధానమిచ్చాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -