Friday, July 10, 2026
E-PAPER
Homeక్రైమ్కూలిన ప్రభుత్వ పాఠశాల పైకప్పు

కూలిన ప్రభుత్వ పాఠశాల పైకప్పు

- Advertisement -

వతెలంగాణ కొల్లాపూర్‌: ప్రభుత్వ పాఠశాల తరగతి గది పైకప్పు కూలిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం నుంచి విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. విద్యార్థులు తరగతిలో ఉండగా ఒక్కసారిగా తరగతి గది పైకప్పు ముందు భాగం కూలింది. విద్యార్థులకు కొద్ది దూరంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది.

పాఠశాలలో 107 మంది విద్యార్థులకు గాను శుక్రవారం.. 70 మంది విద్యార్థులు హాజరైనట్టు ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ తెలిపారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు రోజులాగే ప్రార్ధన అనంతరం తరగతి గదిలోకి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. వర్ష కాలం వస్తే పాఠశాల గదులు వర్షపు నీటితో నిండిపోతాయని, కొన్ని గదుల్లో పెచ్చులూడిపడి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 70 ఏండ్ల క్రితం నిర్మించిన పాఠశాల కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -