Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగస్టు 15 నుంచి మైనార్టీ గురుకుల విద్యార్థులకు ఏఐ పాఠాలు

ఆగస్టు 15 నుంచి మైనార్టీ గురుకుల విద్యార్థులకు ఏఐ పాఠాలు

- Advertisement -

మంత్రి అజహరుద్దీన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో మస్క్‌ నెక్ట్స్‌ ‌జనరేషన్‌, డాక్సా కన్సల్టింగ్‌ ‌ప్రయివేటు లిమిటెడ్‌ ‌భాగస్వామ్యంతో 80 వేల మంది మైనార్టీ విద్యార్థులకు ఏఐ పాఠాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ సంక్ష‍ేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజహరుద్దీన్‌ ఇందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థ (టిమ్రీస్‌) పరిధిలోని 205 పాఠశాలలు, కళాశాలల్లో చదివే దాదాపు 80 వేల మంది విద్యార్థుల కోసం ఏఐ రెడీనెస్, డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అందించాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చేనెల 15 నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, సామాజిక బాధ్యతతో కూడిన భాగస్వామ్య విధానంలో పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అందించనుందని వివరించారు. మైనార్టీ విద్యార్థులు కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను పొందేలా ఈ కార్యక్రమం రూపొందించామని తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన మస్క్‌ ‌నెక్స్ట్‌ ‌జనరేషన్‌ వ్యవస్థాపకురాలు, సీఈవో అవ్ని త్రివేది, డాక్సా కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌ ప్రతినిధి జోసెఫ్ క్రిస్టోఫర్, టిమ్రీస్‌ కార్యదర్శి బి షఫియుల్లా, అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -