సాహిత్యానికి ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
కాళోజీ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలను చిరస్మరణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కాళోజీ చిత్రపటానికి ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రజా ప్రభుత్వం సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ భాషకు కాళోజీ చేసిన సేవలు శ్లాఘణీయమని… ఆయన స్ఫూర్తితో తెలంగాణ భాష, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేశారు.
ప్రజాచైతన్యకారుడు కాళోజీ : టీపీసీసీ అధ్యక్షులు బి.మహేశ్‌కుమార్ గౌడ్
ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు నివాళులు అర్పించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సమాజం, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కాళోజీ తన సాహిత్యం ద్వారా ప్రజల సమస్యలను, సామాజిక అసమానతలను, పాలకుల వైఖరిని ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ జీవితాంతం పోరాడారని తెలిపారు. ఆయన రచనల్లో తెలంగాణ ప్రజల జీవన విధానం, యాస, భాష, సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల తరఫున నిలబడటం, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించడం వంటి కాళోజీ ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
కాళోజీ సేవలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



