Saturday, July 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వర్షాలు లేక ఎండుతున్న పంటలు

వర్షాలు లేక ఎండుతున్న పంటలు

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు ప్రతి ఏడాది ఎదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దింతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడి ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాదిలో వర్షాభావం తక్కువగానే ఉందని వాతావరణ శాఖ ముందుగానే సూచించని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులు ఎక్కువగా సొయా, పత్తి పంటలు సాగుచేశారు. ఓ కంపనికి చెందిన విత్తనాలు మొలకలెత్తలేదని కొందరు రైతులు వాపోయారు. మరోవైపు మొలకెత్తిన సోయా, పత్తి పంటలకు సరిపడా వానలు లేక మొలకలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా మండల పరిధిలో వర్షాలు పడడం లేదని, దీంతో చేసేదేంలేక రైతులు బోరుబావుల నుంచి పంటలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ పంట చేతికొస్తుందో లేదో అనే అనుమానం రైతులను వెంటాడుతూనే ఉంది. మరి కొంతమంది రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామాలలోని మహిళలు వరుణుడు కరుణించాలని గ్రామదేవతలకు పూజలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -