Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన

ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – ధర్పల్లి
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ధర్పల్లి మండల ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ శ్రీకాంత్ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పద్ధతులు, తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణ, మహిళల ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న కుటుంబమే సంతోషకరమైన కుటుంబమని, కుటుంబ నియంత్రణ ద్వారా తల్లి, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలు, గర్భనిరోధక పద్ధతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శ్రీకాంత్,ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఉదయ పద్మ,హెడ్ నర్సు జారిన, స్టాఫ్ నర్స్ జ్యోతి,సుజాత, సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది మురళి,పూజ, పద్మ,మల్లేశ్,లత, రాహుల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -