నల్లగుట్ట తండా సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీనివాస్
నవతెలంగాణ-నెల్లికుదుర
నెల్లికుదురు కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని, ఎస్టీలకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ లు నెల్లికుదురుపై దృష్టి సారించాలని నల్లగుట్ట తండా సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీనివాస్ అన్నారు. శనివారం నల్లగుట్ట తండాలో ఆమె మాట్లాడుతూ.. నెల్లికుదురు కోపరేటివ్ బ్యాంక్ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు జనరల్, బీసీ వర్గాల వారే చైర్మన్ పదవిని చేపట్టారని తెలిపారు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లికుదురు మండలంలో గిరిజన జనాభా అధికంగా ఉందనీ, అందుకే ఈసారి కచ్చితంగా ఈ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల దృష్ట్యా కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని ఎస్టి వర్గానికి కేటాయించి, ఎస్టి రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించి గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. పార్టీలో టికెట్ ఏ టికెట్ ఎవరికొచ్చినా ఎస్టీలం అందరం ఐక్యంగా ఉండి పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్నామని గుర్తుచేశారు. అదేవిధంగా పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ గిరిజన ముద్దుబిడ్డలైన ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు, నెల్లికుదురు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని ఎస్టీ రిజర్వేషన్ కు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



