నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి, అదే విధంగా శ్రీ లక్ష్మీ నారాయణ గోశాలకు వేరువేరుగా మద్నూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సారంగులవారు గంగారం ఆయన పరివారి పేరున విరాళాలు అందజేశారు. శ్రీ లక్ష్మీ నారాయణ గోశాలకు రూ.11,111 శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి రూ.5,111 మొత్తం రూ.16,222 సోమవారం లక్ష్మీనారాయణ ఆలయంలో గోశాల చైర్మన్ గాండ్ల సంజుకు, ఆలయ చైర్మన్ సందుర్ వార్ హనుమాన్ నులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయునికి ఆలయ చైర్మన్ లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల కమిటీ క్యాషియర్ మంజు, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ క్యాషియర్ నాగేష్, గ్రామ పెద్దలు కంచిన్వార్ హనుమాన్లు, ఆలయ పూజారి బండి గంగారం, గల్లి వాసులు పింటూ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి, గోశాలకు విరాళాలు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



