Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక్రెడిట్ కార్డుతో 'ఇన్సూరెన్స్' చెల్లింపులకు బ్రేక్

క్రెడిట్ కార్డుతో ‘ఇన్సూరెన్స్’ చెల్లింపులకు బ్రేక్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్సూరెన్స్ సంస్థ (LIC) భారీ షాకిచ్చింది.LIC అధికారిక వెబ్‌సైట్ కస్టమర్ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియంలను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే సదుపాయం తొలగించింది. దీంతో క్రెడిట్ కార్డులను ఉపయోగించి డిజిటల్‌గా ప్రీమియంలు చెల్లించే పాలసీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను తొలగించడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏజెంట్ల ద్వారా, LIC శాఖల్లో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం కొనసాగుతోంది.ఈ అంశంపై LIC నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇన్సూరెన్స్ దిగ్గజం నుంచి క్లారిటీ వచ్చేవరకూ పాలసీదారులు యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -