- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బలహీనపడిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మార్పుల వల్ల సముద్రపు గాలులు బలంగా వీస్తూ దట్టమైన మేఘాలు అలుముకోనున్నాయని పేర్కొంది. రెండు, మూడు రోజుల్లో ఇది అల్పపీడనంగా మారి ఒడిశా, బెంగాల్ తీరాల వైపు పయనించి, తూర్పు భారతదేశంలో వర్షాలు కురిపించనుందని వెల్లడించింది. జులై 19 వరకు తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, గురువారం జోరందుకుంటాయని అంచనా వేసింది.
- Advertisement -



