- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావు మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈక్రమంలో పాఠశాలలో పరిశుభ్రత, విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అలాగే విద్యాలయ స్టోర్ రూమ్ సందర్శించి అన్ని వస్తువులు ఫ్రెష్ గా ఉన్నాయో లేఓ అనే వాటిని పరిశీలించారు. మద్నూర్ గ్రామంలో మురికి కాలువలు తీయడాన్ని పరిశీలించారు. మేనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని పరిశీలించారు మండల ప్రత్యేక అధికారి పరిశీలనలో ఎంపీడీవో రాణి మద్నూర్ గ్రామ కార్యదర్శి సందీప్ మేనూర్ గ్రామ కార్యదర్శి హరీష్ కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
- Advertisement -



