Wednesday, July 15, 2026
E-PAPER
Homeజాతీయంక్షిణీస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం..ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

క్షిణీస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం..ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ 20 రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షిణిస్తుంది. తాజాగా ఆయన ఆరోగ్యం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలైంది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి వాదనలు రేపు(గురువారం) వాయిదా వేసింది.

కాగా, ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆందోళనలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్, సోనమ్ వాంగ్‌చుక్ 20 రోజులకు పైగా నిరహార చేస్తున్నారు. వీరి దీక్షకు ప్రతిపక్షాల తోపాటు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -