Wednesday, July 15, 2026
E-PAPER
Homeఖమ్మంగాయపడిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి పరామర్శ

గాయపడిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి పరామర్శ

- Advertisement -

– వైద్య ఖర్చుల కోసం ఆర్థిక చేయూత
నవతెలంగాణ – సత్తుపల్లి 
: ​సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు గుమ్మడయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ వెంకటే స్పందించి  బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి  పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గుమ్మడయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన కాంగ్రెస్ నాయకుడు కమల్ పాషాకు, కమిషనర్ నరసింహకు గమ్మడయ్య  కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -