నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సెమీకాన్ 2.0 కోసం 1,27,500 కోట్ల రూపాయల కేటాయింపులకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. వరుణ నది వెంట 6/4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 10,998 కోట్ల రూపాయలు కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంగానది వెంట ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 14,448 కోట్ల రూపాయలు కేటాయించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం కోసం 62,500 కోట్ల రూపాయలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. పారాదీప్-హరిదాస్పూర్ రైల్వే లైన్ డబ్బింగ్ కోసం 2,542 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. దంగోపోసి- రాజ్ కర్ సావన్ మధ్య నాలుగవ రైల్వే లైన్ నిర్మాణానికి 1,365 కోట్ల రూపాయలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
యూరియా పాలసీకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



