Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా ప్రమాణస్వీకారం

నేడు గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా ప్రమాణస్వీకారం

- Advertisement -

బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా బుధవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్య క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. నూతన గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి డి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -