- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ఈ రోజు హరియాణాలోని జింద్ స్టేషన్‌లో ఈ హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు జింద్-సోనిపత్ స్టేషన్ల మధ్య ప్రయాణించనుంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదో ముందడుగు. ఇప్పటివరకూ స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్లలో ప్రయాణించిన భారతావని.. ఇకపై హైడ్రోజన్ రైళ్లలోనూ విహరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది ఈ హైడ్రోజన్ రైలు.
- Advertisement -



