- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తెరిచి ఉన్న రైల్వే గేటు వద్ద పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లే కారు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



