- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన 9 కిలోగ్రాములకు పైగా బరువు కోల్పోయారు, ప్రస్తుతం బరువు 56.9 కిలోగ్రాములకు పడిపోయింది. శరీరానికి ఆహారం అందకపోవడంతో కండరాలు క్షీణిస్తున్నాయని, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయని వైద్యులు తెలిపారు.
- Advertisement -



