- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యంపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా తాజాగా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగత అభిప్రాయమని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆ కామెంట్స్ వాస్తవాలను ప్రతిబింబించట్లేదని అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అన్నారు. నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టులో తొలి దశ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక 2030 కల్లా జపాన్‌కు చెందిన ఈ10 సిరీస్ బుల్లెట్ రైళ్లు సరఫరా అవుతాయని ప్రభుత్వ వర్గాలు గతంలో పేర్కొన్నాయి.
- Advertisement -



